తనకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్న చంద్రబాబు.. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. ఇన్పెక్షన్ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే (హోం) ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని చెప్పిన చంద్రబాబు.. ఇటీవల కాలంలో తనను కలిసి ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, ఏ మాత్రం అనుమానం ఉన్నా ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.
ఏపీలో ఇటీవల భారీగా కరోనా కేసులు నమోదవుతున్నందున.. ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడంతో పాటు కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అలాగే బూస్టర్ డోస్ కాలపరిమితి తగ్గించాలని కేంద్రానికి లేఖరాయనున్నట్లు జగన్ తెలిపారు.