ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆయన హామీ ఇచ్చిన నవరత్నాల పథకాలు. వాటిని అమలు చేసే విషయంలోనే ఆయన పాలన ముందుకు సాగుతోందని వైసీపీ నేతలు చెబుతుంటారు.
2/ 6
తాజాగా నవరత్నాల పథకాలన్నీ సీఎం జగన్ అమలు చేశారని ధీమా వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి నవరత్నాల నిలయాన్ని నిర్మించారు.
3/ 6
పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో 'జగనన్న నవరత్న' పథకాలను కళ్లకు కట్టినట్టు గుడి కట్టించారు.
4/ 6
ఇందులో జగన్ ఫొటో ఏర్పాటు చేసి నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా చిత్రాలను రూపొందించారు.
5/ 6
ఇందులో ప్రత్యేకంగా అద్దాల గోపురం నిర్మించారు. మధ్యలో సీఎం వైఎస్ జగన్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. రాగి ఆకుల్లో సీఎం జగన్ బొమ్మను చిత్రీకరించారు.
6/ 6
అద్దాల గోపురంలోకి వెళ్లి ఎటు చూసినా సీఎం వైఎస్ జగన్ ఫొటోలు కనిపిస్తాయి. ఈ నవరత్నాల నిలయం కోసం ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి తెప్పించారు.