శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
2/ 6
ఈ నెల 23న సాయంత్రం 3.50 గంటలకు సీఎం జగన్ రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
3/ 6
అక్కడ నుంచి రోడ్ మార్గం ద్వారా 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కి చేరుకుంటారు.
4/ 6
తిరుమలలో సాయంత్రం 6.20 గంటలకు సీఎం జగన్ శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
5/ 6
ఆ రోజు రాత్రి తిరుమలలోనే బస చేయనున్న సీం జగన్.. మరుసటి రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
6/ 6
24 ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి జరగబోయే భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.