కోళ్లు, పాడిపశువుల పెంపకం, గొర్రెలు–మేకల పెంపకం, కిరాణా వ్యాపారం, చేనేత, వస్త్ర వ్యాపారం, తదితర లాభసాటి ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వమిచ్చే డబ్బును పెట్టుబడిగా ఉపయోగించుకుంటే పేదరికానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని సీఎ జగన్ అన్నారు. బ్యాంకులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు.