వీటితో పాటు అసెంబ్లీలో పలు శాఖల బాధ్యతలను కూడా సీఎం జగన్ ఇతర మంత్రులకు అప్పగించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబుకు, లా అండ్ ఆర్డర్ హోం మంత్రి మేకతోటి సుచరిత, న్యాయశాఖను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎన్నారై సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖను మంత్రి పేర్ని నానికి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని.. అందుకోసం తమ కుటుంబానికి చెందిన రూ.225 కోట్లు విలువ చేసే మెరిట్స్ కాలేజీ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. సీఎం జగన్ ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశుముంది. (File Photo)