Cm Jagan: ప్రధాని మోదీ, అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ..కీలకాంశాలపై చర్చ
Cm Jagan: ప్రధాని మోదీ, అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ..కీలకాంశాలపై చర్చ
Cm Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం అనంతరం సాయంత్రం సీఎం ఢిల్లీకి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీతో, అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై వారికి జగన్ వివరించారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం అనంతరం సాయంత్రం సీఎం ఢిల్లీకి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీతో, అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై వారికి జగన్ వివరించారు.
2/ 6
ఈరోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీతో సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా 14 అంశాలపై వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
3/ 6
రాష్ట్ర సమస్యలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలు, పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరగా పరిష్కారించాలని సీఎం జగన్ ప్రధానిని కోరినట్లు తెలుస్తుంది.
4/ 6
ఇక ఆ తరువాత మధ్యాహ్నం సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ అయ్యారు.
5/ 6
ఈ భేటీలో ప్రధాని మోదీ దగ్గర ప్రస్తావించిన అంశాలతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని ఆయన కోరారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అమిత్ షాకు సీఎం జగన్ వినతిపత్రం అందించారు.
6/ 6
కాగా సీఎం జగన్ ఒక్కరోజు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు. ఉదయం ప్రధాని మోదీతో ఆ తరువాత అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని తాడేపల్లిలోని నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు.