ఏపీ విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరూరు బండపై ఈ గుడిని పునర్నిర్మించారు. ఇందుకోసం తన సొంత నిధులను ఖర్చుచేసినట్టుగా మంత్రి చెప్పారు. కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.