Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం.. !
Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం.. !
తిరుమల భక్తులకు శుభవార్త. కొండపై సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సుల్లో శ్రీవారి భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
తిరుమల వెళ్లే భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న బస్సులు వచ్చేశాయి. తిరుమలలో సామాన్య భక్తుల కోసం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు..
2/ 11
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మేన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ధర్మరధాల పేరుతో సామాన్య భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలలో భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయని తెలిపారు..
3/ 11
ఒక్కో బస్సు విలువ కోటి 80 లక్షల ఉంటుందని మొత్తం 18 కోట్లు విలువచేసే పది ఒలెక్ట్ర కంపెనీ బస్సులను మెగా ఇంజనీరింగ్ సంస్థ విరాళంగా అందజేసిందని టీటీడీ చైర్మన్ తెలిపారు.
4/ 11
తిరుమలలో పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏడాది క్రితమే ప్రారంభించామని అన్నారు. అందులో భాగంగా అధికారులు సిబ్బందికి విధి నిర్వహణ కోసం కోసం ఎలక్ట్రిక్ కార్లను ఇచ్చామని తెలిపారు..
5/ 11
ముఖ్యమంత్రి వైయస్ జగన్ చొరవతో 65 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రతిరోజు తిరుపతి నుంచి తిరుమల మధ్య నడుపుతోందని అన్నారు. తాజాగా పది ఎలక్ట్రిక్ బస్సుల కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.
6/ 11
ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. లడ్డు కౌంటర్లలో ప్లాస్టిక్ రహిత కవర్లతో పాటు తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్లను పూర్తిస్థాయిలో నిషేధించామని తెలిపారు.
7/ 11
రాబోయే రోజుల్లో తిరుమలలో పర్యావరణం కాపాడేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
8/ 11
మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు చెందిన ‘ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్’ సంస్థ ఈ బస్సులను తయారు చేసింది. హైదరాబాద్ సమీపంలోని ప్లాంట్‌లో తయారుచేసిన ఈ బస్సులను టీటీడీకి కానుకగా అందజేసింది.
9/ 11
తిరుమల కొండపై ఇప్పటికే ‘ధర్మరథం’ పేరుతో డీజిల్ బస్సులు భక్తుల కోసం ఉచిత సేవలు అందిస్తున్నాయి. కొండపై బస్టాప్, సత్రాల నుంచి ప్రధాన ఆలయానికి చేరుకునేందుకు భక్తులు ఈ బస్సులను వినియోగించుకుంటున్నారు.
10/ 11
9 మీటర్ల పొడవుండే ఈ బస్సులో 23 మంది సీట్లలో కూర్చొని ప్రయాణించవచ్చని తెలిపారు. భక్తులకు పూర్తి భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం అందించేలా బస్సును తయారు చేశారన్నారు.
11/ 11
ఈ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమల కొండపై తిరుమల కొండపై భక్తులు శబ్ద, వాయు కాలుష్యంలేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని టీటీడీ ఛైర్మన్ చెప్పారు.