పుత్తూరు-తిరుపతి ప్రధాన రహదారిపై ఉంది కైలాస కోన వాటర్ ఫాల్స్. అద్భుతమైన అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. చుట్టూ సుందర దృశ్యాలు, మనసుని అహ్లాదపరిచే జలగార శబ్ధంతో ఎంతో సందడిగా ఉంటుంది. అసలు కైలాస కోన జలపాతం అనే పేరు ఎలా వచ్చింది. ఇక్కడ వెలసిన శివుడు నిజమైన ఆత్మలింగమేనా..??? హిందూ పురాణాల, ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి.(Photo:Face Book)
తిరుపతి నుండి నలభై నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉండే కైలాసకోన జలపాతం ఎంతో ప్రత్యేకమైందిగా చెబుతారు. పురాణాల ప్రకారం నాలుగు విధాలుగా చరిత్ర చెప్తుంటారు ఇక్కడి పండితులు. శ్రీ పద్మావతి., శ్రీశ్రీనివాసుల కళ్యాణం నారాయణ వనంలో రంగరంగ వైభవంగా సాగింది. మోల్లోకాల్లో ఉన్న దేవతలు అందరూ వివాహానికి హాజరయ్యారు.(Photo:Face Book)
అదే సమయంలో కైలాస కోన అందాలు చూసిన పరమేశ్వరులు ఒక్కసారిగా ఇక్కడ తపస్సు చేయాలని భావించాడట. అప్పట్లో ఇక్కడ కొన్ని రోజులు తపస్సు చేసిన ప్రాంతం కావడం వల్లే దీనిని కైలాస కొనగా పిలుస్తారని కొందరు చెప్తారు. అగస్త్య మహాముని శ్రీ శ్రీనివాసునికి శ్రీ పద్మావతి దేవిని అప్పగించిన స్థలంగా వాడుకలో ఉంది.(Photo:Face Book)
శ్రీ పద్మావతి..శ్రీ శ్రీవాసుని కళ్యాణం అనంతరం అప్పగింత కార్యక్రమం వేడుకగా నిర్వహిస్తాడు ఆకాశరాజు. అదే సమయంలో తన చేతుల మీదుగా కాకుండా అగస్త్య మహా మునితో అప్పగించాలి కార్యక్రమం చేయాలనే కోరిక ఉండేది ఆకాశరాజుకి. అదే సమయంలో అగస్త్య మహా ముని కైలాస కొనలో తప్పదు చేస్తూ ఉండే వాడు. తన కోరికను అగస్త్య మహా మునితో చెప్పి పద్మవతి అమ్మవారి అప్పగింతలు కార్యక్రమం చేయాలనీ కోరుతాడు ఆకాశరాజు.(Photo:Face Book)
అందుకు అగస్త్య మహాముని ఒప్పుకోవడంతో నారాయణవనం నుంచి బారి సారె, మంది మార్బలంతో కైలాసకోన చేరుకొని అగస్త్య మహాముని చేతుల మీదుగా ఇదే కైలాసకోనలో శ్రీ పద్మావతి దేవిని శ్రీశ్రీనివాసునికి అప్పగింతలు కార్యక్రమం జరిగిందని పురాణ చరిత్ర చెబుతోంది. అంతకు మునుపు అగస్త్య మహాముని పరమశివుడి కటాక్షం కోసం తపస్సు ఆచరించి ఇక్కడ ఆత్మలింగంను ప్రతిష్టించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ ఆలయంకు దక్షిణకాశీగా పిలువబడితుంది. (Photo:Face Book)
అంతే కాకుండా ప్రతి ఏటా శివరాత్రి, కార్తీక సోమవారాలు వంటి పర్వదినాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక పరమ శివుడుతో పాటుగా పార్వతీ దేవి అమ్మవారు కూడా కొలువైయుంటారు. అంతే కాకుండా మహా శివుడి ఆలయంకు ప్రక్కనే ఉన్న కైలాసకోన జలపాతంలో ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. (Photo:Face Book)
ఈ జలపాతంకు పై భాగంలోని ఓ పెద్ద బండరాయి నుండి నీటి ధార మొదలై క్రిందకు వస్తుందని, ఈ కైలాసకోన జలపాతంలో ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉండడం ద్వారా రోగాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే కైలాసకోన జలపాతంలో స్నానం ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడి పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు.(Photo:Face Book)
ఇక్కడ మరో విచిత్రమైన ఘట్టం ఏంటంటే.... ఏళ్ల తరబడి నానాటికి పెరుగుతున్న ఓ పుట్ట దర్శనమిస్తుంది. ఆ పుట్టలో ఓ పచ్చని నాగుపాము ఉంటుందని ఒక్కడ పండితులు చెప్తున్నారు. సహజంగా విడిద వర్ణాలలోఉండే నాగుపాము.... ఇక్కడ మాత్రం ఆకుపచ్చని రంగులో ఉంటుందని... అది ఇంత వరకు ఎవరికీ హాని చేయలేదని చెప్తున్నారు. (Photo:Face Book)
కైలాసకోన కడప నుండి చెన్నై వరకు జాతీయ రహదారి 40 లో ఉంది. తిరుపతి తిరుపతి నుండి కైలాసకోన వరకు ఎలా చేరుకోవాలి 44 కి.మీ. సంబంధిత స్టేషన్ల నుండి బస్సు లేదా రైలు రవాణా అందుబాటులో ఉంది.తిరుపతి నుండి సత్యవేడు వరకు చేరుకోవడానికి కలిసకోన రోడ్ స్టాప్ వద్ద దిగాలి. తిరుపతి నుండి పుత్తూరు వరకు ట్రైన్ సదుపాయం ఉటుంది. పుత్తూరు నుంచి చాల బస్సులు కైలాస కోనకు వెళ్తుంటాయి.(Photo:Face Book)