చిరంజీవి తెలుగులో ఓ వెలుగు వెలిగి ఒక సాధారణ నటుడిని నుంచి మెగాస్టార్గా ఎదిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనుకున్న ఇమేజ్ కారణంగా 2008లో ప్రజా రాజ్యం పార్టీ పెట్టారు. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో 294 నియోజకవర్గాల్లో పోటీ చేసారు. అంతేకాదు అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను ఢీ కొంటూ ఉభయ రాష్ట్రాల్లో 18 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నారు. చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయినా.. తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలిచారు. (Twitter/Photo)
ఆపై 2014 ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపట్టినా.. అప్పటికే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏప ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడంతో అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. దీంతో చిరంజీవి ఆ ఎన్నికల తర్వాత తన అడుగులను తనకు నటుడిగా ఎంతో ఇచ్చిన సినీ రంగంలోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పిలిచినా.. ఆ వైపు చూడటం లేదు. (Twitter/Photo)
సినీ రంగంలో రారాజుగా ఉన్న తనకు రాజకీయాలు అంతగా పడవు అన్న ధోరణిలోనే ఏ పార్టీకి అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్న.. ఆయన్ని మాత్రం రాజకీయాలు విడిచిపెట్టడం లేదు. తాజాగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపిచడంపై సినీ,రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. (Twitter/Photo)
ఇప్పటికే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నబాటలో రాజకీయాల్లో ప్రవేశించినా.. మొదటిసారి పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో BSP, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల మద్ధతులో పోటీలో దిగి పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు చోట్ల ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీకి ఏపీలో మిత్ర పక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ను కాదని చిరంజీవిని ఈ ఉత్సవాలకు పిలవడంపై కాపు ఓటు బ్యాంకు పై బీజేపీ గురిపెట్టడమే అనే విషయం తెలియజేస్తోంది. Pawan Kalyan Chiranjeevi : Twitter
ప్రస్తుతం చిరంజీవి.. ఉన్న పళంగా ఏ రాజకీయా పార్టీలో చేరడనే విషయం స్పష్టమైంది. ఈయన అటు వైసీపీతో పాటు తెలంగాణలో టీఆర్ఎస్తో సఖ్యతతో మెలుగుతున్నారు. ఇక బీజేపీ చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడం.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్.. బీజేపీ మిత్ర పక్షంగా వ్యవహరించడం వెనక రాబోయే ఎన్నికల్లో చిరు వర్గానికి చెందిన కాపు ఓట్లను బీజేపీ వైపు ఆకర్షితులయ్యేలా చేయడంలో భాగంగానే చిరుకు ప్రత్యేక ఆహ్వానం అందించినట్టు తెలుస్తోంది. మరీ ఏపీలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి చిరంజీవి ఫ్యాక్టర్ ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. (Twitter/Photo)