ఎండాకాలం మొదలైనప్పటి నుంచీ క్రమంగా పెరుగుతూ వచ్చిన చికెన్ రేటు ఇప్పుడు రికార్డుస్థాయికి చేరింది. చేరాయి. సహా అంతటా చికెన్ ధరలు రూ.280 నుంచి రూ.300గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గురువారం నాటికి చికెన్ రేటు అత్యధికంగా పెరిగింది. ప్రధానంగా విశాఖపట్నంలో చికెన్ ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆంధ్రప్రదేశ్ లో చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.312గా నిర్ణయించారు. కోళ్ల పరిశ్రమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ఇప్పటివరకూ గరిష్ఠ ధర రూ.290. ఇప్పుడు దాన్ని కూడా దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తూ సాగుతోంది. మే నెల ఒకటో తేదీన రూ.238 ఉన్న చికెన్.. పది రోజుల్లోనే రూ.74 పెరిగి రూ.312కి చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ రెండు రోజులు భారీ వర్షాలు కురిసినా, ఎండల తీవ్రత ఇంకా తగ్గకపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడం తదితర కారణాల వల్ల రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్ డిమాండ్‌కు సరిపడినంత చికెన్ లేనందున పది రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు పెరిగి ఏప్రిల్ 1 నుంచి నెలాఖరు వరకు వడగాడ్పులు వీచాయి. గాలిలో తేమశాతం తగ్గడం, వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కింది. ఇది కోళ్ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. మేత తక్కువగా తిని, ఎక్కువగా నీళ్లపై ఆధారపడడంతో కోళ్లు ఆశించిన బరువు పెరగలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
వేసవిలో 45 రోజులకు సగటున కోడి రెండు కిలోలు అవుతుంది. కానీ ఇప్పుడది కిలోన్నర కూడా రావడం లేదని, ఫారంలోఉంచితే ఎండకు చనిపోతాయనే భయంతో వెంటనే అమ్మేస్తున్నారని తెలుస్తోంది. వర్షాలు లేక కూరగాయల దిగుబడులు తగ్గడం, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వ్యాపారాలు జోరందుకోవడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమైంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆదివారం 7లక్షల కిలోలు, మిగిలిన రోజుల్లో సగటున 3-3.5 లక్షల కిలోల కోడిమాంసం అమ్మకాలు జరుగుతున్నాయని, అందు కు తగ్గట్టుగా ఫారాల్లో కోళ్లు లేవని విశాఖ బ్రాయిలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు థాట్రాజు అప్పారావు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నారు. ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా ఉందని ఆయన తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
కాగా, ధరల పెరుగుదలకు కోళ్ల పరిశ్రమలో కంపెనీల గుత్తాధిపత్యమే కారణమని కొందరు రైతులు వాదిస్తున్నారు. ప్రస్తుతం కోళ్ల పరిశ్రమలో 80 నుంచి 85 శాతం వాటా కంపెనీలదేనని, మిగిలిన 15-20 శాతమే రైతులు ఉన్నారని చెబుతున్నారు. దీనికితోడు చాలామంది రైతులు కోళ్లు పెంచి కంపెనీలకు అందిస్తున్నారు. అంటే పిల్ల, మేత, మందులు కంపెనీలు సరఫరా చేస్తుండగా... రైతులు కోళ్లు పెంచి తిరిగి అవే కంపెనీలకు అందజేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందుకుగాను ఆ రోజు రేటుపై నాలుగు నుంచి ఆరు రూపాయల వరకు కమీషన్ ఇస్తారు. ఈ నేపథ్యంలో ధరల నిర్ణయంలో కంపెనీలదే కీలకపాత్ర కావడంతో మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారని కొందరు రైతులు చెబుతున్నారు. కంపెనీల మధ్య వ్యాపారపరంగా పోటీ ఉన్నా ధరల నిర్ణయంలో మాత్రమే దాదాపు ఒకేమాట మీద ఉంటారని, ప్రస్తుతం చికెన్ ధరల పెంపునకు కంపెనీలే కారణమని పౌల్ట్రీ రైతులు అంటున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)