CA turned Police: ఆమె నిరుపేద తాపీమేస్ట్రీ కుమార్తె.. పేరు ఎం. మల్లి.. చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసింది.. లో మంచి ఉద్యోగం కూడా సంపాదించింది. కానీ అదేదీ ఆమెకు ఆనందాన్ని ఇవ్వలేదు.. ఆమె పడిన కష్టాలు.. పెరిగిన వాతావరణం.. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు.. మంచి ఉద్యోగం.. డబ్బు చాలా అవసరం.. అందుకు తగ్గట్టే మంచి జీతంతో కూడిన గౌరవ ప్రథమైన ఉద్యోగం వచ్చింది. అయినా ఆమెకు ఎదో వెలితి అనిపించింది.
ఆమె లక్ష్యం గురించి తెలుసుకున్న ఉపాధ్యాయులు కూడా ఆమెను ప్రోత్సహించారు. కానీ తల్లిదండ్రులను ఒప్పించడానికి మాత్రం సమయం తీసుకున్నా.. ఆమె నిర్ణయం వెనుకు ఉన్న ఇష్టాన్ని గుర్తించి.. మల్లిక కోరికను తల్లిదండ్రులు అంగీకరించారు. జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో ఇప్పుడు పోలీసు ఉద్యోగంలో చేరారు.