తోట చంద్రయ్య బైక్పై వెళుతుండగా దాడి చేశారని.. కర్రలు, కత్తులతో చంద్రయ్యను హత్య చేశారని తెలిపారు. చంద్రయ్య కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందాలతో గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. చంద్రయ్య హత్య కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
శివరామయ్య ఈ మధ్య గ్రామంలోని ఓ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో తోట చంద్రయ్య నీ హత్యకు కుట్ర పన్నుతున్నాడని అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెప్పారు. చంద్రయ్య తనపై దాడి చేసేలోపే అతనిపై దాడి చేసి చంపేయాలని శివరామయ్య నిర్ణయానికొచ్చాడు. మరో ఏడుగురితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం బైక్పై వస్తున్న చంద్రయ్యను అడ్డగించి దారుణంగా హత్య చేసి చంపేశారు.