PICS: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబునాయుడు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవుడు దేవాన్షన్‌తో కలసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబునాయుడి కుటుంబం ఆ తర్వాత వాహనసేవలో పాల్గొంది. పెద్దశేషవాహనంపై విహరిస్తున్న స్వామివారిని ముఖ్యమంత్రి, కుటుంబసభ్యులు దర్శించుకున్నారు.