PICS: వైభవంగా తిరుమల శ్రీవారి చక్రస్నానం

తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ఉదయం శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. వరాహస్వామి ఆలయం సమీపంలోని పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు, చక్రాతాళ్వార్లకు వేదమంత్రాలతో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. వేలాది భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.