నందమూరి హీరో తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్యంపై అందరిలోనూ టెన్షన్ నెలకొంది. అప్పటివరకు బాగానే ఉన్న తారకరత్న సడన్ గా కుప్పకూలడం అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం..వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తారకరత్న గుండెపోటుకు గురయ్యాడని వెల్లడించడం చక చకా జరిగిపోయాయి. ఇక తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్యంపై అతని సోదరుడు చైతన్య కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు.
గతంలో తారకరత్నకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇది అనుకోకుండా జరిగింది. బ్యాడ్ లక్. హార్ట్ స్ట్రోక్ రావడంతో షాక్ కు గురయ్యాడు. ఆయన త్వరగా కోలుకోవాలని మనం ప్రార్ధిద్దాం అని చైతన్య తెలిపాడు. తారకరత్న కోమాలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు చైతన్య కృష్ణ షాకింగ్ వార్త చెప్పాడు. తారకరత్న కోమాలో ఉన్నాడు. అయితే ఆయనకు మరికొన్ని రోజులు వైద్యం అందించాలని డాక్టర్లు చెబుతున్నారన్నారు.
కాగా ఈరోజు సాయంత్రం బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి వచ్చారు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. అయితే సోమవారం తారకరత్నకు మరిన్ని వైద్య పరీక్షలు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. (Pc: Twitter)