Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయాన్నే ఆమె ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆమెకు టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. ఆలయ వెలుపల వచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భక్తులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు..
మరోవైపు ప్రస్తుతం తిరుమలలో రద్దీ తగ్గడం లేదు.. సాధారణ రోజుల్లోనూ భారీగానే భక్తులు వస్తున్నారు. ఇక బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,243కి చేరింది.
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 32,652 మంది ఉన్నారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం 4.41 కోట్లు వచ్చింది.
సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.