భారతీయ టెలికాం శాఖ ఆధ్వర్యంలోని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (U.S.O.F) దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో నాణ్యమైన, సరసమైన మొబైల్ మరియు డిజిటల్ సేవలను అందించాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ మేరకు చేపట్టిన ప్రాజెక్ట్ లో భాగంగా ఆంధ్ర-తెలంగాణ ప్రాంతంలోని ఏజన్సీ ఏరియాలో సుమారు 250 పైచిలుకు సెల్ ఫోన్ టవర్ల నిర్మాణం చేపట్టారు.
అంతే గాక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి విధ్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు కూడా సెల్ఫోన్ సేవలు నిలచిపోకుండా సోలార్ విధ్యుత్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీ సహాయంతో ఇక్కడ సోలార్ పవర్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో విధ్యుత్ అంతరాయం లేక పోవడమే కాక టవర్ల నిర్వహణ ఖర్చును కూడా తగ్గించే వీలుంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రసాద్ నాయక్ లు తెలియజేశారు.