ఒకవేళ జగన్ ఓడిపోతే.. చంద్రబాబు వారసుడిగా లోకేష్ నేనున్నానంటూ ముందుకొస్తాడు. టీడీపీ ఈ రెండు పార్టీల్లో ఎవరు వచ్చినా .. రాజుల కాలంలో మాదిరగా వారసత్వమే అవుతుంది. ఒకవేళ బ్రహ్మంగారు చెప్పినట్లు వైరల్ అవుతున్న ఫోటోలో వారసత్వాలు పోయి పవనుడు వచ్చేడయా మొదటి లైన్లో చెప్పినట్లు చూస్తే పవన్ కళ్యాన్ రావాలి.
అయితే పొత్తు లేకుండా పోటీకి దిగితే ఈ సారి పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపించే అవకాశాలు ఎక్కవ. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినన్ని సీట్లు రాకపోయినా... ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం కీలకంగా మారనున్న ఛాన్స్ లు కూడా లేకపోలేదు. అటు టీడీపీ కూడా జగన్‌ను మరోసారి గెలిచే అవకాశం ఇవ్వకూడదని సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తోంది.
జగన్’ను ఎలా అయినా గద్దె దించాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అవసరం అయతే అందుకు పవన్ కళ్యాణ్‌కు సీఎం సీటు ఇవ్వడానికి కూడా వెనుకాడదు. ఇవన్నీ చూస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు అన్నీ అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయమనిపిస్తోంది. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం అవుతుందో లేదో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.