బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమలో సందడి చేస్తున్నారు. అమీర్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కోసం కాకినాడ వచ్చారు.
2/ 10
శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడులో షూటింగ్ జరిగింది.
3/ 10
కోడూరుపాడు గ్రామంలోని ఓ వీధిలో షూటింగ్ జరిగింది. అమీర్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఆయనతో ఫోటోలు తీసుకుని ఆనందించారు.
4/ 10
ఈ సందర్భంగా కోనసీమ ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో అమీర్ ను సత్కరించారు.
5/ 10
శనివారం కాకినాడ బీచ్‌లో జరిగే షూటింగ్లో అమీర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
6/ 10
శనివారం సాయంత్రం షూటింగ్ ముగించుకోని తిరిగి ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
7/ 10
లాల్ సింగ్ చద్దాలో టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
8/ 10
ఇటీవల కార్గిల్, లడఖ్, శ్రీనగర్ లొకేషన్స్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు చైతన్య. (Twitter/Photo)
9/ 10
ఈ షెడ్యూల్స్‌లో ఆమిర్, చైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్రదర్శకుడు అద్వైత్ చందన్. కాగా చైకి హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం.