kangana Ranaut Rahu Kethu Pooja: సినిమాల గురించి తెలిసిన ఎవరికైనా పరిచయం అవసరం లేని పేరు కంగనా రనౌత్.. జాతీయ స్థాయిలో ఫైర్ బ్రాండ్ గా క్రేజ్ దక్కించుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో సపరేట్ గా ముద్ర వేసుకుంది. సినిమాల్లోనూ కాదు రియల్ లైఫ్ లోనూ చాలా డిఫెరెంట్ గా ఉంటోంది. వివాదాలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలిచిన ఆమె.. ఆధ్యాత్మికంగా కనిపించడంతో అంతా షాక్ కు గురయ్యారు.
కంగనా కు శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనంను వేద పండితులు చేయించి ఆ తర్వాత ఆశీర్వచనాలు ఇచ్చి ప్రసాదంను ఇచ్చి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అంతకు ముందు దేవాలయంలోనే రాహు కేతు పూజలు వేద పండితులు నిర్వహించగా కంగనా పాల్గొన్నారు. కంగనా ఉన్నట్టుండి తిరుమల, శ్రీకాళహస్తి దేవాలయం దర్శనం రావడంతో ఏపీ పోలీసులు హడావుడి చేశారు.