బాలీవుడ్ (Bollywood) ఫైర్ బ్రాండ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranauth) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
2/ 6
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులు కోసం తిరుమలకు వచ్చామని తెలిపారు.
3/ 6
కంగనా రనౌత్ తిరుమల రావడంతో ఆమెను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇక ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్ తో కనిపించే కంగనా.. తిరుమలలో మాత్రం ఎరుపురంగు చీర, నుదుటన బొట్టుతో సాంప్రదాయంగా దర్శనమిచ్చారు.
4/ 6
బాలీవుడ్ లో కంగనా రనౌత్ కు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తో పాటు నెపోటిజం వంటి అంశాలపై బహిరంగంగానే స్పందించి విమర్శించారు. అలాగే స్టార్ హీరో హృతిక్ రోషన్ పైనా సంచలన కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కారు కంగనా.
5/ 6
నటనలోనూ అదరగొడుతున్న కంగనా ఇప్పటివరకు నాలుగు జాతీయ వార్డులు, ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన మణికర్ణికకు కూడా ఆమె నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది.
6/ 6
ప్రస్తుతం కంగనా పలు సినిమాలతో పాటు లాకప్ పేరుతో నిర్వహిస్తున్న ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వివాదాస్పదమైన ఈ షోలో కంటెస్టెంట్లను 72 రోజుల పాటు లాకప్ లో బంధిస్తారు. అంతేకాదు వారికి సంబంధించి ఎవరికీ చెప్పని నిజాలను కూడా ఈ షోలో చెప్పిస్తారు.