Singer Sreerama Chandra: బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ లో అత్యంత క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లో సింగర్ శ్రీరామ్ చంద్ర ఒకడు.. ముఖ్యంగా లవర్ బాయ్ ఇమేజ్ తో.. భారీ ఓట్లు దక్కించుకుని.. తొలి ఫినాలే టికెట్ దక్కించుకున్నారు.. అదే గుర్తింపుతో టాప్ త్రీగా నిలిచాడు.. బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన భామలంతా శ్రీరామ్ అంటే ఇష్టం అని బహిరంగంగానే చెప్పారు. బయట కూడా అదే రిలేషన్ మెయింటెన్ చేస్తున్నారు.
బిగ్ బాస్ కు వెళ్లకముందు శ్రీరామ చంద్రకు ఒక ప్రముఖ సింగర్ గానే గుర్తింపు ఉండేది.. తరువాత లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో శ్రీ రామచంద్ర ఎంతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి తనకు పెళ్లి చేయాలని ఇంట్లో ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తున్నారని.. అయితే తనకు ఎలాంటి అమ్మాయి కావాలి అనే విషయాన్ని కూడా బయట పెట్టాడు.
తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి అనే విషయం గురించి పెద్దగా సెలక్షన్స్ ఏమి లేకపోయినప్పటికీ తనని తన తల్లిదండ్రులను ఫ్యామిలీని మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలని ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో శ్రీరామచంద్ర క్లారిటీ ఇచ్చారు. మరి ఈయన మనసుకు నచ్చిన అమ్మాయి ఎక్కడ ఉందో ఎప్పుడు తనకు ఎదురై వీరి వివాహం జరుగుతుందో వేచి చూడాలి.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సింగర్ శ్రీరామ్ కు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. తాజాగా ఓటీటీ ‘ఆహా’… తన తదుపరి షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ను ప్రకటించింది. తెలుగు వారిలోని గాత్ర ప్రతిభను వెలికితీయడానికి, సరైన వేదిక కల్పించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది. ఈ కార్యక్రమానికి సింగింగ్ సెన్సేషన్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్నారు.