TitleConquerorShannu:ఒకటి కాదు.. రెండు కాదు.. గత ఐదేళ్లుగా తెలుగు స్మాల్ స్క్రీన్ పై రికార్డు టీఆర్పీలతో సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్ తెలుగు. తాజా సీజన్ bigg boss 5 teluguలో టైటిల్ విన్నర్ గా భావిస్తున్న వారిలో ఒక కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmuk Jaswanth)రికార్డులపై రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.
బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ విజేత ఎవరన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ముందునుంచి ఉన్న సోషల్ మీడియా క్రేజ్ తో షణ్ను విన్నర్ అవుతాడని అతడి ఫ్యాన్స్ భావించారు.. కానీ ఊహించని విధంగా వీజే సన్నీ రేసులో ముందుకు దూసుకొచ్చాడు.. కామెడీ.. ఎమోషన్, గేమ్ స్పిరిట్, ఫ్రెండ్ షిప్ ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుంటూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సింగర్ శ్రీరామ్ సైతం టైటిల్ రేసులో ముందుకు దూసుకు వెళ్తున్నారు. వీళ్లు ఇద్దరి నుంచి షణ్ముఖ్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నాడు.
సిరీ షణ్ముక్ హగ్గులు.. ముద్దుల వ్యవహారం కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్నా.. అతడి ఫ్యాన్స్ మాత్రం షణ్ముఖ్ ను నెంబర్ వన్ స్థానంలో నిలపే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతడ్ని ట్రెండ్ సెట్టర్ గా ఉండేలా చేస్తున్నారు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి.. ప్రస్తుతం టాప్ 5 లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు ట్విట్టర్లో సునామీ సృష్టిస్తున్నారు.
షణ్ముఖ్ పేరుతో ఏకంగా నేషనల్ రికార్డులు నమోదు అవుతున్నాయి. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండడంతో రికార్డు పై రికార్డులు నమోదవుతున్నాయి. షణ్ముఖ్ జస్వంత్‌కు పలువురు సెలెబ్రిటీలు సైతం సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
నెమ్మదిగా మొదలు పెట్టి స్ట్రాంగ్‌గా తాజా సీజన్లోకి టైటిల్ ఫేవరెట్‌గా షణ్ముఖ్ జస్వంత్ చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయినా అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు.
షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొదటి వారం నుంచి వీళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించారు. దీంతో వీళ్లిద్దరూ దూరంగా.. దగ్గరగా ఉంటూ డౌట్లు క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడూ రొమాన్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందే షణ్ముఖ్ జస్వంత్.. దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు. అలాగే, సిరి హన్మంత్.. శ్రీహాన్‌తో లవ్‌లో ఉంది. అయినప్పటికీ వీళ్లిద్దరూ షోలో జంటగా మారిపోయారు. తరచూ కలిసే ఉంటున్నారు.. కలిసే ఆడుతున్నారు. ఒక్కోసారి హగ్ చేసుకుంటారు.. ఒక్కోసారి ముద్దులు పెట్టుకుంటారు. అంతేకాదు, ఏకంగా ఒకరి మీద ఒకరు పడుకుంటారు. దీంతో వీళ్లిద్దరిపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.
ఆ విమర్శలు ఎలా ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం అతడ్ని అంత పైన కూర్చోబెడుతున్నారు. ట్విట్టర్లో షణ్ముఖ్ ఫ్యాన్స్ సందడి బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో టైటిల్ ఫేవరెట్ షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు స్పీడు పెంచేశారు. ఇటీవల అతడి పేరిట సోషల్ మీడియాలో పలుమార్లు ట్రెండ్ సెట్ చేసిన వాళ్లు.. వేరే కంటెస్టెంట్ల అభిమానులతో సైతం యుద్ధానికి రెడీ అయ్యారు.
గత వారం షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు ట్విట్టర్లో UnstoppableShannu అనే ట్యాగ్‌తో ట్వీట్ల సునామీ సృష్టించారు. ఇది నేషనల్ రికార్డుగా నిలిచింది. తాజాగా మరో హాష్ ట్యాగ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. #TitleConquerorShannu (టైటిల్ విజేత షణ్ముఖ్) షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ గెలుస్తాడు అటూ చేసిన ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో డ్రెండ్ అయ్యింది. కేవలం ఏడు గంటల్లోనే 1.1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఓవరాల్ గా 16 మిలియ ట్వీట్లతో రెండోసారి నేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. గతంలో ఏ భాషలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కూ ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు.
ఇలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లలో షణ్ముఖ్ క్రేజ్ ఇంకాస్త రెట్టింపు అవుతోంది. ప్రస్తుతం అతడి అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ఈ సీజన్‌కు విన్నర్‌ను చేసినా ఆశ్చర్యపోయే పని లేదనే చెప్పాలి. గతంలో అభిజీత్ ఫ్యాన్స్ కూడా ఇలాగే ట్విట్టర్లో ట్రెండ్ సెట్ చేశారు. తర్వాత అతడిని విన్నర్‌ను చేశారు. అయితే ఈ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా.. ఓట్ల రూపంగా ఎంత వరకు మారుతాయి అన్నది చూడాలి.. ఏది ఏమైనా టైటిల్ మాత్రం వీజేసన్నీ -షన్ముఖ్ జస్వంత్ మధ్యే ఉంటుందంటున్నారు బిగ్ బాస్ రివ్యూవర్లు..