Health Tips: నాన్ వెజ్ లేనిదే చాలామందికి ముద్ద దిగదు.. అయితే కొందరు నార్మల్ గా నాన్ వెజ్ తింటూ ఉంటారు. కొంతమందికి అయితే అసలు నాన్ వెజ్ లేని రోజు ఆహారం తీసుకున్న ఫీలింగే ఉండదు.. అయితే అలా అతిగా మాంసాన్ని తీసుకునే వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేదంటే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకునే వారు అవుతారు.
తాజాగా ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..? ఇటీవల, వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, క్యాన్సర్ రీసెర్చ్ యూకే, ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ చేసిన అధ్యయనంలో, మాంసాహారుల కంటే శాఖాహారులకు క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదం తక్కువంటూ తేల్చింది. ఈ అధ్యయనం BMC మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.
అయితే తొలి గ్రూపులో వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ రోజులు నాన్ వెజ్ తినే వారు ఉన్నారు. వీరంతా రెడ్ మీట్ నుంచి చికెన్‌తోపాటు అన్ని రకాల నాన్ వెజ్ తినేవారు ఉన్నట్టు గుర్తించారు. రెండో సమూహంలో వారానికి ఐదు లేదా అంతకంటే తక్కువ రోజులు మాంసం తినే వ్యక్తులు ఉన్నారు. మూడవ సమూహం పెస్కాటేరియన్లు, అంటే చేపలు తినేవారిని ఉంచారు. నాల్గవ, చివరి సమూహంలో, శాఖాహారులను ఉంచారు. వీరు మాంసం, చేపలు అంటే నాన్ వెజ్ తినరు.
ఇక తక్కువ మాంసం తినేవారిలో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా 9% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. శాకాహార స్త్రీలలో రుతుక్రమం ఆగిన తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 18% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి కారణం సాధారణ బరువు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెస్కాటేరియన్లలో 20% తక్కువగా, మాంసాహారుల కంటే శాఖాహారులలో 31% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.