ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదోతరగతి పరీక్షా (AP SSC Results-2022) ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) రిజల్ట్స్ ను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో ప్రకాశం జిల్లా (Prakasham District) టాప్ స్థానంలో నిలిచింది, అనంతపురం జిల్లా 49 శాతం పాస్ పర్సంటేజ్ తో చివరి స్థానంలో ఉంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే పరీక్షలు ముగిసిన తర్వాత కేవలం 28 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని.. నిజానికి 26 రోజులకే రిజల్ట్స్ రెడీ అయిపోయినట్లు మంత్రి బొత్స తెలిపారు. కానీ ఫలితాల్లో చోటు చేసుకుంటున్న తప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా టెన్త్ ఎగ్జామ్స్ 100 మార్కులకు నిర్వహిస్తారు. అందులో 35 అంతకంటే ఎక్కువ మార్కులొస్తేనే పాసైనట్లు, 35 కంటే తక్కువ మార్కులు వస్తే ఫెయిలయినట్లే. సప్లిమెంటరీ రాసి పాసైతేగానీ పై చదువులకు వెళ్లేందుకు అవకాశముండదు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే ఓ విద్యార్థికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఓ స్టూడెంట్ కు మ్యాథ్స్ లో 17, సోషల్ స్టడీస్ లో 11 మార్కులు వచ్చినా పాసైనట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఫలితాల ప్రకటన లోపాలపుట్టగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.