Sagar to Srisailam Journey: కృష్ణమ్మ తీరంలో పర్యాటకం సందడిగా ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజీ, కృష్ణమ్మ అలలు, భవానీ ద్వీపం అందాలు రెండు మూడేంటి.. అడుగు అడుగునా పర్యాటక ప్రాంతాలే దర్శనమిస్తాయి. ప్రకృతి అందాలే కాదు.. ఆధ్యాత్మిక భావన కూడా మదిని హాయిగా ఉండేలా చేస్తుంది. అందుకే ఈ టూర్ కు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు తెలుగు ప్రజలు..
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే లాంచీ ప్రయాణం హాయిగా ఉంటుంది. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను అందించనుంది. పక్షుల కిలకిలరావాలతో, నీటి సవ్వడుల మధ్య సాగే ఈ జర్నీలో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతూ కొండల మధ్య తిరుగుతూ ఉంటుంది. మనకు తెలియని కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు లాంచీలో గైడ్ కూడా ఉంటాడు.
ఈ పర్యటటను ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. విహార యాత్రలతో కృష్ణానదీ తీరం మళ్లీ సందర్శకులతో కళకళలాడుతోంది. కొవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత భవానీ ద్వీపం తిరిగి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రకాశం బ్యారేజీతో పాటు భవానీ ద్వీపం చూసేందుకు పర్యాటక ప్రేమికులు పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ప్రయాణం క్షణ క్షణం ఆహ్లాదంగా సాగుతూనే ఉంది. సాయంత్రం శ్రీశైలం చేరుకున్న తరువాత ఆ రాత్రి అక్కడే బస చేసి.. దైవ దర్శనం, దర్శనీయ స్థలాల సందర్శన తరువాత మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 3 గంటలకు లాంచీ సాగర్‌కు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
ఛార్జీల వివరాలిలా ఇవే..
సాగర్ నుంచి శ్రీశైలానికి ఒకవైపు పెద్దలకు 1,500 రూపాయలు వసూలు చేస్తారు.. అదే పిల్లలకు అయితే 1,200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే శ్రీశైలం నుంచి సాగర్ వైపు కూడా సేమ్: ఇదే ఛార్జీ వసూలు చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం పిక్ నిక్ లు.. పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారికి ఇదే సరైన అవకాశం.
కృష్ణమ్మ పరవళ్లలో ప్రయాణిస్తూ నల్లమల అటవీ అందాలను వీక్షించాలనుకుంటున్న వారికి ఇదే సరైన సమయం.. మళ్లీ కరోనా హెచ్చరికలు అందుతున్న వేళ.. ముందుగానే టూర్ లను ప్లాన్ చేసుకోవడం బెటర్ అని చాలామంది భావిస్తున్నారు. చుట్టూ ప్రకృతి అందాలతో అలరారే పచ్చదనంతో కప్పేసిన ఎత్తయిన కొండల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులను ఎంతగానో అలరించనుంది. సాగర్ నుంచి శ్రీశైలం వరకు 110 కిలో మీటర్ల దూరం లాంచీలో ఏడు గంటల పాటు ప్రయాణం ఉంటుంది.