Baganrraju Success Meet: అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. సంక్రాంతి కానుకగా విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. సంక్రాంతి సినిమాగా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయలను రాబట్టి రికార్డు కలెక్షన్ల దిశగా పరుగులు తీస్తోంది. అయితే ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఆ పరిస్థితుల నేపథ్యంలో పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ చేయాలి అంటే భయపడ్డాయి. ఆ కారణంతోనే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడ్డాయి అని టాక్.. వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇటు ప్రభుత్వం అటు టాలీవుడ్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో సినిమాలు రిలీజ్ కావడం కష్టమే అనుకున్నారంతా..?
అదే సమయంలో టాలీవుడ్ తో సంబంధాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. చిరంజీవి తనతో బాగా ఉంటారని అనడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. అప్పటి వరకు ఎన్నిసార్లు అపాయింట్ అడిగినా కుదరదని చెబుతూ వచ్చిన ఏపీ ప్రభుత్వం.. చిరంజీవిని ఆహ్వానించింది. లంచ్ మీట్ పేరుతో సినిమా సమస్యలపై చిరంజీవితో జగన్ చర్చలు జరిపారు. పలు హామీలు కూడా ఇచ్చారు.
తాజాగా నాగార్జున వ్యాఖ్యలు చూస్తే.. నిజంగానే ఏపీ ప్రభుత్వం బంగార్రాజు సినిమాకు పెద్ద ప్లస్ చేసిందని అనిపించక మానదు.. అంతకుముందు నాని నటించిన శ్యామ్ సింగరాయ్ టైంలో థియేటర్లు మూసి వేయడం.. రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు.. కానీ నాగార్జున సినిమా విషయానికి వచ్చే సరికి సీన్ రివర్స్ అయ్యింది.
తాజాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ నారాయణ మూర్తి సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. సినిమాని కాపాడాలని సంక్రాంతి కి లాక్ డౌన్ కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షో లకు పర్మిషన్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పండగంటే దేవుడి పండుగ, కోడి పందాల పండుగ, సినిమా పండగ. సినిమాని కాపాడాలని ఈ నాలుగు రోజులు లాక్ డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని షో లు బ్రహ్మాండంగా ఆడించుకోండని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడంతో బంగార్రాజు మంచి విజయాన్ని అందుకుంది అన్నారు.