ASANI CYCLONE CAME CLOSER TO ANDHRA PRADESH COAST AS SOME DISTRICTS AFFECTED WITH HEAVY RAINS FULL DETAILS HERE PRN
Asani Cyclone Alert: బలహీన పడిన అసని తుఫాన్..కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. తీరాన్ని తాకేది అక్కడే..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసని తుఫాన్ (Cyclone Asani) బీభత్సం సృష్టిస్తోంది. అసని ధాటికి కోస్తా జిల్లాలు అతాలకుతలమవుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో తిరుపతి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసని తుఫాన్ (Cyclone Asani) బీభత్సం సృష్టిస్తోంది. అసని ధాటికి కోస్తా జిల్లాలు అతాలకుతలమవుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో తిరుపతి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని 10 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
2/ 6
ఇదిలా ఉంటే అసని తీవ్రతుఫపాను నుంచి తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయాదినికి తుపాను వాయుగుండంగా బలహీనపడే అవకాశమున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. అసని తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది.
3/ 6
ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 550 కి.మీ., పూరీకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశమున్నట్లు అధికారులు ప్రకటించారు.
4/ 6
తుఫాన్ క్రమంగా ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపూరం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
5/ 6
తుఫాన్ ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడతాయని పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని అధిసారులు తెలిపారు.
6/ 6
తుఫాన్ సహాయక చర్యల కోసం 9 SDRF, 9 NDRF బృందాలను సిద్ధంగా ఉంచినట్లు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. తుఫాన్ తీవ్రత దృష్ట్యా లోతట్టు, తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.