చిత్తూరు జిల్లా (Chittoor District) నగరి ఎమ్మెల్యే రోజా (MLA Roja) భర్త ఆర్కే సెల్వమణి (MLA Roja Husband Selvamani)పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై చెన్నైలోని జార్జి టౌన్ కోర్టు వారెంట్ జారీ చేసింది.
2/ 6
2016లో సెల్వమణితో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్పరసు ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రాపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ బోద్రా చెన్నై జార్జి టౌన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
3/ 6
కొంతకాలం క్రితం బోద్రా మృతి చెందగా.. ఆయన కుమారుడు కేసును కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీన కోర్టు వాయిదా ఉన్నా సెల్వమణి, అన్బరసు కోర్టుకు హాజరుకాలేదు. వారి తరపు లాయర్లు కూడా కోర్టుకు రాలేదు.
4/ 6
దీంతో ఆగ్రహించిన కోర్టు సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూచేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఐతే అరెస్ట్ వారెంట్ పై సెల్వమణి ఇంకా స్పందించలేదు.
5/ 6
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రోజాతో పాటే నగరిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రోజా నియోజకవర్గంలో లేని సమయంలో ఆయన అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
6/ 6
త్వరలో ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండటంతో రోజా మంత్రి పదవి కోసం యత్నిస్తున్నారు. ఈలోగా ఆమె భర్తపై అరెస్ట్ వారెంట్ జారీ అవడం చర్చనీయాంశమవుతోంది. కేబినెట్ మార్పులపై సీఎం జగన్ కామెంట్స్ చేసినప్పటి నుంచి రోజా వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు.