Army Helicpter Crash: తమిళనాడులో (Tamilnadu) కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన (Army Helicopter Crash) ఘటనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసి కూడా మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. చిత్తూరు జిల్లా కురబలకోట ఎగువ రేగడ గ్రామానికి చెందిన జవాన్ సాయి తేజ సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేస్తున్నారు. ఆర్మీలో చేరిన అతి కొద్ది కాలంలోనే ఎంతో గుర్తింపు దక్కింది. అందుకే సీడీఎస్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో సభ్యుడయ్యారు.
సాయి తేజకు భార్య శ్యామల, మూడేళ్ల కుమార్తె దర్శిని, కుమారుడు ఐదేళ్ల మోక్షజ్ఞ ఉన్నారు. ప్రస్తుతం సాయితేజ కుటుంబ సభ్యులు మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్నారు. ఈ ఏడాది వినాయక చవితికి స్వగ్రామానికి వచ్చారు సాయి తేజ.. ఆ సమయంలో గ్రామంలో అందరితో చాలా కలివిడిగా ఉన్నారంటూ గ్రామస్థులు అతడి గుర్తులను నెమరవేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.
సాయి తేజ చివరి మాట ఇదే..
ప్రమాదానికి ముందు అంటే ఉదయం 8.45 గంటలకు సాయితేజ వీడియో కాల్ చేసి భార్య, కుమార్తె, కుమారుడితో మాట్లాడారు. కుమారుడితోనే చివరిగా మాట్లాడినట్టు తెలుస్తోంది. బాగా చదువుకో.. అల్లరి చేయకు.. త్వరలోనే ఇంటికి వస్తాను.. మంచి గిప్ట్ తెస్తాను అని కొడుక్కి చెప్పినట్టు తెలుస్తోంది. అవే అతడి చివరి మాటలు అంటూ ఆ కుంటుంబం గుర్తు చేసుకుంటోంది.
సాయితేజ మృతితో మదనపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆ కుటుంబ సభ్యులంతా స్వగ్రామానికి చేరుకున్నారు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు.
తమిళనాడులోని ఊటీ కొండల్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా బృందంలో సభ్యుడిగా ఉన్న సాయితేజ ఈరోజు మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు మృతి చెందారు. సాయితేజ మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.