ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరోబాదుడుకు సిద్ధమైంది. ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ఛార్జీలు పెంచేందుకు దాదాపు కసరత్తు పూర్తి చేసింది. డీజిల్ సెస్ పెంపు కారణంగా ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి నుంచి ఛార్జీలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
డీజిల్ సెస్ పెంపు వల్ల ఇప్పటికే పొరుగురాష్ట్రమైన తెలంగాణలో ఛార్జీలు పెరిగాయి. తెలంగాణ ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల బస్సువైపు ఆసక్తి చూపిస్తుండటంతో తెలంగాణ ఆర్టీసీ ఇటీవలే ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు లేఖరాసింది. అంతర్రాష్ట్ర ఒప్పందం కారణంగా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల ఛార్జీలు ఒకేవిధంగా ఉండాలన్న నిబంధనను టీఎస్ఆర్టీసీ లేవనెత్తింది. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఛార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఐతే కొన్ని కారణాల వల్ల ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఛార్జీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఐతే నిబంధనల ప్రకారం ఛార్జీలు పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో సిటీ బస్సలు తప్ప మిగిలిన అన్నిరకాల బస్సుల్లోనూ ఛార్జీలు పెరగనున్నాయి. సిటీ బస్సులను మాత్రం డీజిస్ సెస్ నుంచి మినహాయించారు. ( Photo Credit: Facebook)
ఐతే తక్కువ దూరాలు నడిచే బస్సుల్లో ఛార్జీలు పెరిగే అకాశం లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుల్లో మినిమం ఛార్జి రూ.10గా ఉంది. దానిని యథాతథంగా ఉంచే అవకాశముంది. అలాగే 30 కిలోమీటర్ల లోపు వరకు ఛార్జీలు పెంచే అకాశం లేదని.. 35-60 కిలోమీటర్ల వరకు రూ.5, 60-70 వరకు రూ.10, 100 కిలోమీటర్ల పైన రూ.20 వరకు పెంచనున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇక ఎక్స్ ప్రెస్ బస్సుల విషయానికి వస్తే ఈ సర్వీసుల్లో కూడా తొలి 30 కిలీమీటర్ల వరకు సెస్ పెంపును విధించడం లేదు. 31-65 కిలోమీటర్ల వరకు రూ.5, 66-80 కిలోమీటర్ల మధ్య రూ.10 పెంచనున్నారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్ పై ప్రస్తుతం రూ.10 వసూలు చేస్తుండగా.. కొత్తగా వచ్చే 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. (ప్రతీకాత్మకచిత్రం)
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లై సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70, అమరావతి ఏసీ బస్సుల్లో రూ.80 వరకు డీజిల్ సెస్ పెరగనుంది. తాజా పెంపుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. దగ్గర ప్రాంతాలకు పర్యటించేవారికి ఇబ్బంది లేకపోయినా.. దూరప్రాంతాలకు వెళ్లేవారికి మాత్రం చేతి చమురు వదలాల్సిందే. (ప్రతీకాత్మకచిత్రం)