ప్రతి రోజు సాయత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరే వెన్నెల స్లీపర్ సర్వీస్ లో టికెట్ చార్జి రూ.1,830 కాగా.. 20శాతం రాయితీతో రూ.1,490కే ప్రయాణించే అవకాశముంది. అలాగే సాయంత్రం 6గంటల కు బయలుదేరే అమరావతి ఏసీ బస్సులో బెంగళూరుకు రూ.1,710 టికెట్ చార్జీ కాగా.. డిస్కౌంట్ పోనూ రూ.1,365కే ప్రయాణించవచ్చు. (Photo Credit: Facebook)
ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బెంగళూరులో వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతర పనుల మీద వెళ్లేవారికి ఈ డిస్కౌంట్ ఉపయోగకరంగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. వీకెండ్ లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో టికెట్ ధరలను సాధారణంగానే ఉంచింది. (Photo Credit: Facebook)