ప్రయాణికులు, డ్రైవర్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. ఐతే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. డ్రైవర్ ఫోన్ నెంబర్ ఉంటే ఒకటి రెండు నిముషాలు ఆలస్యమైనా.. ఫోన్ చేసి అప్రమత్తం చేసే అవకాశముంటుందని కొందరు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. డ్రైవర్లు మాత్రం ఆర్టీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. డ్రైవింగ్ లో ఉండగా ప్యాసింజర్ల నుంచి ఫోన్లు వచ్చే అవకాశముండదని చెబుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఆన్ లైన్ సర్వీసుల్లో కీలక మార్పులు చేయనుంది. అన్ని సేవలూ ఒకే యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి అభి బస్ (Abhi Bus) తో డీల్ కుదుర్చుకుంది. యునైటెడ్ టికెటింగ్ సొల్యూషన్ కోసం టెండర్లు ఆహ్వానించిన ఏపీఎస్ ఆర్టీసీ అతి తక్కువ ధరకు కోట్ చేసి అభిబస్ కు టెండర్ ఇచ్చింది. మరో ఆరు నెలల్లో కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఏపీఎస్ ఆర్టీసీలో ప్రతి రోజూ అన్నిరకాల సర్వీసుల్లో 30లక్షల టికెట్లు బుక్ అవుతాయి. ఈ లెక్కన ఒక్కో టికెట్ కు 17పైసల చొప్పున రూ.5లక్షలకు పైగా చెల్లించనుంది. ఇలా ఐదేళ్లకు అన్ని సర్వీసులకు గానీ మొత్తం రూ.70కోట్లను ప్రభుత్వం అభిబస్ కు చెల్లించనుంది. ఇందులో రూ.30కోట్ల వరకు కేంద్రం నుంచి రానుంది. ప్రభుత్వం చెల్లించే అన్నిరకాల సర్వీసులను 17పైసల ధరకే అభిబస్ అందించనుంది.(ప్రతీకాత్మకచిత్రం)