Bonalu 2021: హైదరాబాద్‌లో బోనమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే.. మంత్రి పదవి వస్తే మళ్లీ వస్తా...

Bonalu 2021: హైదరాబాద్‌లో లాల్ దర్వాజ బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులంతా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం నుంచే ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తి పాటలతో గల్లీలన్నీ మార్మోగిపోతున్నాయి. ఐతే తెలంగాణతో పాటు ఏపీ నేతలు కూడా బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.