Best TOurist spot in Andhra Pradesh: సమ్మర్ అప్పుడే ఎంటర్ అయ్యింది.. సమ్మర్ లో సరదగా ఎక్కడికైనా వెళ్లి ఆహ్లాదం పొందాలి అనుకుంటున్నారా..? వీకెండ్ లో సరదగా స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తున్నారా? ఏదైనా సరికొత్త ప్రయాణాన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకు ఆధ్యాత్మికంతో పాటు ఆహ్లాదాన్ని అందించేందుకు ఆ జిల్లా స్వాగతం పలుకుతోంది. బహుబలి సినిమా షూటింగ్ స్పాట్ గా ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఆంధ్రప్రదేశ్ లోనూ కర్నూలు జిల్లా పర్యాటకులకు సరికొత్త అనుభూతలను మిగులుస్తోంది. అయితే కర్నూలు ట్రిప్‌కు ప్లాన్ చేసుకున్నప్పుడు తప్పకుండా అక్కడి ప్రత్యేకతలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఈ జిల్లాలోనే ఉంది. వీటితోపాటు కొండారెడ్డి బురుజు, మల్లెల తీర్థం, నల్లమల అటవీప్రాంతం, శ్రీశైలం డ్యాం, ఆధోని కోటతో పాటు బాహుబలి షూటింగ్ స్పాట్ అదనపుం అందం.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా రికార్డుల మోత మోగించిన బహుబలి సినిమాలో కొంత భాగం ఇక్కడే చిత్రీకరించారు. ప్రభాస్, రానాల కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది అంటే.. వీటి అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలితో పాటు జయం మనదేరా, టక్కరి దొంగ, సుభాష్ చంద్రబోస్ తదితర సినిమా షూటింగ్ లు ఇక్కడే జరిగాయి.