అటు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. కడప జిల్లాలోని పలు భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలతో పాటుగా సత్యసాయి జిల్లాలో కూడ అక్కడక్కడ వర్షాలుంటాయి. కానీ గత ఐదు రోజులతో పోలిస్తే ఈ రోజు రాయలసీమ జిల్లాల్లో తక్కుగానే వర్షాలుండే అవకాశాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్టణం, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)