టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పై వైసీపీ (YSRCP) నేతలు నిత్యం విమర్శలు చేస్తుంటారు. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అయితే చంద్రబాబుపై మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై విజయసాయి రెడ్డి వేసే ట్వీట్లు, సైటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.