YCP MP:ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చక్కగా వెంకటేశ్వర స్వామి గెటప్ లో బాగా సూట్ అయ్యారు. కాదా..? అయితే పొరపాటున ఈయన నటుడో.. లేక డ్రామా అర్టిస్టిట్ అనుకుంటే పొరపాటే.. ఆయన ఒక పార్టీ నేత.. ఎంపీ కూడా.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఎంపీల్లో ఈయన ఒకరు.. మరి ఎందుకీ వేషం వేశారు అనుకుంటున్నారా..?
జాతరలో భాగంగా ఆదివారం వెంకటేశ్వర స్వామి వేషధారణలో వెళ్లిన గురుమూర్తి గంగమ్మ తల్లికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా గురుమూర్తే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తిరుపతి గంగమ్మ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పిన గురుమూర్తి.. కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా తాతయ్య గుంట గంగమ్మతల్లి జాతర రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు.
బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. రాయలసీమ పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానాలకు అద్దంపడతాయి. ప్రతి వేషంలోనూ ఎంతో ప్రత్యేకత, ఆధ్యాత్మిక అంతర్యం దాగివుంది. పాలేగాడిని గుర్తించడానికి అమ్మవారు ఆయా రోజుల్లో వేసే వేషాలను భక్తులు అనుసరిస్తుంటారు.
ఇలా వేషధారణలు మారిస్తే.. అమ్మవారు సంతృప్తి చెంది వారి కోరికలు తీర్చుతుందన్నది ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. కరోనా కారణంగా రెండేళ్ళ విరామం తర్వాత ప్రస్తుతం ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా టీటీడీ సిబ్బంది, అధికారులతో సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పీఠాధిపతులు అమ్మవారికి సారెలు సమర్పిస్తున్నారు.