ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో 17 వేలకుపై గా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి.. కోవిడ్ ఆస్పత్రుల సంఖ్యను పెంచింది. ఆక్సిజన్ కొరత రాకుండా ఏర్పాట్లు ప్రారంభించింది. మరోవైపు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టు నిజంగానే 104 కాల్ సెంటర్లు అద్భుతంగా పని చేస్తున్నాయా? ప్రజల కష్టాలను పట్టించుకుంటున్నాయా?.ఓ వైపు కరోనా ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎక్కువమంది 104 ఆశ్రయిస్తుంటారు. మరి వారందరికీ సరిపడ సమాధానాలు చెబుతోందా 104 కాల్ సెంటర్? కానీ కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదని. కొందరు సరిగ్గా స్పందించడం లేదనే ఫిర్యాదులు అయితే భారీగానే ఉన్నాయి.