ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎవర్నీ అంత తేలిగ్గా నమ్మరు అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చాలా సందర్భాల్లో ఇది నిజమైంది కూడా. తాజాగా వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లను కూడా జగన్ నమ్మట్లేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే వాలంటీర్లకు బదులుగా ఆయన.. గృహ సారథులను తెరపైకి తెచ్చారని అంటున్నారు. (File Photo - News18)
సీఎం జగన్ , ఆంధ్రా సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ ప్" width="1600" height="1600" /> వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్ల తర్వాత వాలంటీర్లలో కొంతమంది కమీషన్ల దందా మొదలుపెట్టారు. వీళ్లు లబ్దిదారులకు వచ్చే డబ్బు నుంచి కొంత మొత్తాన్ని కమీషన్ రూపంలో తీసుకుంటున్నారు. దీని వల్ల లబ్దిదారులు నష్టపోతున్నారు. అలా నష్టపోతున్న వారు.. నెక్ట్స్ వైసీపీకి కాకుండా.. మరో పార్టీకి ఓటు వెయ్యాలనే ఆలోచనకు వస్తున్న విషయం సీఎం జగన్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. (File Photo - News18)
ఈ మధ్య గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ వైసీపీ ప్రజా ప్రతినిధుల్లో కొంతమందికి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ అంతా బాగుందనీ.. తమకు తిరుగులేదని ప్రజా ప్రతినిధులు జగన్ ముందు గొప్పగా చెప్పుకుంటున్నారు. దీని వల్ల క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలియట్లేదని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. (File Photo - News18)
పవన్ కల్యాణ్ , చీఫ్ పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ వార్తలు, పవన్ కల్యాణ్ న్యూస్, పవన్ కల్యాణ్ రాజకీయాలు, పవన్ కల్యాణ్ లేటెస్ట్ న్యూస్, వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఏపీ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వ" width="1600" height="1600" /> ఇలాగే ఊరుకుంటే... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తున్న జగన్.. నిజానిజాలు తెలిసేందుకే.. గృహ సారథులను రంగంలోకి దింపుతున్నట్లు తెలిసింది. ఈ గృహ సారథులను ప్రభుత్వం నియమించట్లేదు. వైసీపీ నియమిస్తోంది. ఈ నెల 30 వరకూ నియామకాలు కొనసాగుతాయి. వీరు వైసీపీ కోసమే పనిచేస్తారు. (File Photo - News18)
ఈ వ్యవస్థ ద్వారా నిజానిజాలు తెలుస్తాయనీ.. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. ఎన్నికల లోపు అంతా సెట్ చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఐతే.. గృహ సారథుల రాకతో... వాలంటీర్ల వ్యవస్థ డౌన్ అవుతుందనే అభిప్రాయం ఉంది. మరి కమీషన్లు తీసుకునే వాలంటీర్లకు గృహ సారథులు చెక్ పెడతారా లేక.. వాళ్లు కూడా ఆ తంతులో చేతులు కలుపుతారా అన్నది త్వరలో తెలుస్తుంది. (File Photo - News18)