Minster Roja: నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా (Rk Roja) కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతలతో పోల్చుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువంది అభిమానులు ఉన్నావారిలో ఆమె ఒకరు. ఇంత గుర్తింపు ఉన్న.. నిన్నటి వరకు జస్ట్ ఎమ్మెల్యేగానే ఉన్నారు.
దీంతో రోజాకు ఆ ఒక్క కోరిక ఉండిపోయింది. మంత్రి అనిపించుకోవాలని ఆరాటపడ్డారు. పదే పదే అదే మాట తన సన్నిహితులు దగ్గర చెప్పుకునే వారు. జబర్దస్త్ లాంటి రియాల్టీ షోల్లోనూ మంత్రి పదవి వస్తుందంటూ స్కిట్ లు కూడా ఉండేవి.. అందులోనూ జగన్ సీఎం అయిన వెంటనే.. తనకు మంత్రి పదవి పక్కా అని ఫిక్స్ అయ్యారు.. ప్రచారం జరిగింది. కానీ తొలి కేబినెట్ లో షాక్ తగ్గలేదు.
ఆమెకు మంత్రి పదవి దక్కడానికి దేవుడి వరమే కారణమని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రోజా మొక్కని దేవుడు లేరు.. దర్శించుకోని ఆలయం లేదు అన్నట్టు.. గుళ్లుగోపురాల చుట్టూ ఆమె ప్రదక్షిణలు చేశారు.. మంత్రి పదవి కోసమే ఆమే దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నారని వార్తలు వినిపించాయి.. ఆమె ఏ ఉద్దేశంతో వెళ్లినా.. చివరికి ఆమె కోరిక నెరవేరింది.
ఇక ఆమెకు మంత్రి పదవి దక్కలేదని కేడర్ పూర్తిగా నిరశాలో ఉన్నప్పుడు అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. తుది కసరత్తుగా ఆమె పేరును చేర్చారు సీఎం జగన్.. ఆమెకు సమాచారం కూడా అందించారు. దీంతో ఇప్పుడు రోజాకు ఏ పదవి ఇస్తారంటూ ప్రచారం మొదలైంది.. అయితే చాలామంది రోజాకు హోం మంత్రి దక్కుతుందని ముందే జోస్యం చెబుతున్నారు..
ఎస్సీ కోటాలో తానేటి వనికి ఈ సారి హోం మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. గతంలో మహిళకే హోం మంత్రి పదవి ఇవ్వడంతో ఈసారి కూడా అదే అనవాయితీ కొనసాగే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా ఈ పోర్టు ఫోలియోలపై కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. అయితే రోజాను కేవలం ప్రభుత్వ వాయిస్ గట్టిగా వినిపించేందుకు మాత్రమే తీసుకున్నారనే ప్రచారం ఉంది..
ఆతాజాగా అందుతున్న సమాచారం మేరకు పౌర సరఫాల శాఖ లేదా పరిశ్రమల శాఖ రోజాకు ఇస్తారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు టార్గెట్ గానే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారని వైసీపీ వర్గాల టాక్.. ఎందుకంటే అదే జిల్లా నుంచి మంత్రులుగా పెద్ది రెడ్డి, నారాయణ స్వామిని కొనసాగిస్తూనే.. రోజాకు అందుకే అవకాశం ఇచ్చారంటున్నారు. మె రాజకీయాల్లో ఉంటూనే.. అభిమానులకు చేరువాగానే ఉన్నారు. స్మాల్ స్క్రీన్ ద్వారా.. అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు. జబర్దస్త్ సహా.. ఇతర కార్యక్రాల్లో యాక్టివ్ గా ఉంటూ అందర్నీ నవ్వించేవారు.. అయితే ఇప్పుడు మంత్రిర పదవి ఖరారు కావడంతో.. ఇకపై అలాంటి కార్యక్రమాల్లో రోజా కనిపించే అవకాశం లేదు..