వచ్చే ఎన్నికలు ఇటు నారా లోకేష్ కి.. తెలుగు దేశం పార్టీకి చాలా కీలకం.. ఈ సారి అధికారంలోకి రాకపోతే ఇటు లోకేష్ కు.. అటు పార్టీకి కూడా కష్టాలు తప్పవు. ఇప్పుడు లోకేష్ ముందు రెండు టార్గెట్ లు ఉన్నాయి. మొదటి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన గెలవడం కూడా తప్పని సరి.. వరుసా రెండో సారి కూడా ఓడిపోతే రాజకీయాలకు సెట్ కారనే విమర్శలు వస్తాయి. ఇక ఏపీ వ్యాప్తంగా ఎక్కువ సీట్లు గెలిచి పార్టీ అధికారంలో రాకపోతే.. లోకేష్ కు భవిష్యత్తు కూడా కష్టమే..
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయ్యే రకరాకల అంశాలో థ్రో బ్యాక్ పిక్చర్స్ ఒకటి.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇలాంటి ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం సినిమా హీరోలు, హీరోయిన్ల ఫోటోలనే ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాశారు. ఇప్పుడు రాజకీయ నేతల ఫోటోలు పెట్టి కూడా ఎవరో గుర్తు పట్టారా అని ప్రశ్నిస్తున్నారు.
మొన్నటి వరకు కేవలం సినిమా రంగానికి సంబంధించిన వారి ఫొటోలు మాత్రమే ఎక్కువగా వైరల్ అయ్యాయి. కానీ ప్రస్తుతం రాజకీయ ప్రముఖుల ఫొటోలు కూడా నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటో తాజాగా నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో మీరు గుర్తు పట్టగలరా..? ఇతడి భార్య కూడా స్టార్ హీరో కూతురే..
ఈ కుర్రాడు ఇప్పుడు యంగ్ పొలిటిషయన్.. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. ఎంతో ఘన కీర్తి గల రాజకీయ, సినీ నేపథ్యం వీరి కుటుంబం సొంతం. రాష్ట్రానికి మంత్రిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో పాద యాత్రతో జనల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ కుర్రాడు ఎవరో మీకు అర్థమై ఉంటుంది.
ఈపాటికే ఈ కుర్రాడు ఎవరో మీకు ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది.. మీ ఊహ నిజమే. ఈ కుర్రాడు మరెవరో కాదు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడు నారా లోకేశ్. తండ్రి చంద్రబాబు నాయుడుతో లోకేశ్ దిగిన ఈ ఫొటో ను నారా బ్రాహ్మణి తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోను ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.