ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల యువకుల అత్యుత్సాహం చర్చనీయాంశమవుతోంది. రహస్యంగా ఉంచాల్సిన ఓటును బహిర్గతం చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు యువకులు పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాము ఎవరికి ఓటు వేస్తున్నామో ఫోటో తీసి మరీ వైరల్ చేయడం చర్చనీయాంశమవుతోంది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, పి.లక్ష్మీవాడ గ్రామాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. యువకులు సెల్ఫీలు తీసుకుంటున్నా పోలింగ్ సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.