ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7గం.ల నుంచి సాయంత్రం 5గం.ల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 516 జెడ్పీటీసీ 7,258 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల జరుగుతున్నాయి. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కడప, చిత్తూరు జిల్లాల్లో అత్యధికం ఏకగ్రీవాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33,663 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 6,492 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 2,82,15,104 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండు లక్షల మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.