విడదల రజిని 2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగుదేశం పార్టీలో చేరి పొలిటికల్ కెరీర్ ఆరంభించారు. అప్పటికే ఆమెకు కుమారస్వామితో పెళ్లయింది. ‘హైదరాబాద్ ఐటీ వనంలో చంద్రబాబు నాటిన మొక్కను నేను..’అని విడదల రజని ఓ సభలో సగర్వంగా చెప్పుకున్న వీడియో ఇప్పటికీ వైరల్ జాబితాలోనే నిలుస్తుంది.
టీడీపీలో విడదల రజనికి గురువైన ప్రత్తిపాటి పుల్లారావు 2019 ఎన్నికల్లో చిలకలూరిపేటతో తలపడగా, గురువు పుల్లారావు పై 8301 ఓట్ల మెజారిటీతో శిష్యురాలు రజని గెలుపొందారు. జగన్ తొలి కేబినెట్ లోనే రజనికి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా, సామాజిక సమీకరణల్లో అది సాధ్యం కాలేదు. మళ్లీ మూడేళ్లకు ఆమె కోరుకున్న పదవి దక్కింది.