Good News: సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం జగన మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందే ఉంటున్నారు. చెప్పిన ప్రకారం.. వివిధ పథకాలకు.. విడతల వారీగా నగదు జమ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు.. పథకాలు ప్రవేశ పెట్టారు.. పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించడమే లక్ష్యంగా సీఎం అడుగులు వేస్తున్నారు.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.
గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 1,778 కోట్ల రూపాయలతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ప్రభుత్వం సాయం అందించింది. ఇతర సంక్షేమ పథకాలతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవని సీఎం స్పష్టం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం కింద లబ్ధిచేకూరనుంది.