AP Cabinet Final List: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ కూర్పు చూస్తే.. సీఎం జగన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కులల వారిగా సీట్లు కేటాయించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే.. ఓట్ల పరంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందని.. లెక్కలు వేసుకుంటూ మంత్రుల జాబితాను ఫైనల్ చేశారు అంటున్నారు.
మొదట శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే.. సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావుకు సీఎం అవకాశం కల్పించారు. ఆయన సోదరుడు ధర్మాన దాస్ ను తప్పిస్తూ.. ప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. ఆయన ధర్మాన ప్రసాదరావు
సామజిక వర్గం : శ్రీకాకుళం అర్బన్ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు. పాలనాటి వెలమ.. అంటే బీసీ సామాజిక వర్గానికి ప్రధాన నేత ఆయన.. ఆ వర్గం ఓట్లపై ప్రభావం చూపించడమే కాకుండా.. గతంలో మంత్రిగా అపూర్వ అనుభవం ఆయన సొంతం.. విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో కాని.. పాలన విషయంలో కాని ఆయన సేవలు బాగా ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు.
అదే జిల్లా నుంచి తొలి కేబినెట్ లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న సీదిరి అప్పల రాజుకు మరో ఛాన్స్ ఇచ్చారు. పలాస నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిదిరి.. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత.. మత్స్యకార నేత.. ముఖ్యంగా ఆయనకు అవకాశం కల్పించడానికి ప్రధాన కారణం. మత్స్యవర్గ ఓట్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక విజయనగరం జిల్లా నుంచి సీనియర్ నేత బొత్సకు మరో అవకాశం కల్పించారు సీఎం జగన్.. తొలి కేబినెట్ లోనూ సీనియర్ మంత్రిగా బొత్స కొనసాగారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన ఓ తిరుగులేని నేత.. మరోసారి ఉత్తరాంధ్రపై పట్టు కోసం ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చారు జగన్.. బీసీకి చెందిన బొత్స.. తూర్పు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి ఆయనే ప్రధాన నేత.
గత కేబినెట్ లో విశాఖ నుంచి కేవలం అవంతి మాత్రమే మంత్రిగా కొనసాగారు. ఇప్పుడు ఆయన్ను తప్పించి యువ నేత గుడివాడ అమర్ నాథ్ కు అవకాశం కల్పించారు. ముఖ్యంగా జగన్ కు వీర విధేయుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉత్తరాంధ్రలోని కాపు సాజికి వర్గాన్ని ప్రభావితం చేయగల నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యంగా విపక్షాలకు దూకుడుగా కౌంటర్లు ఇవ్వగలగడం ఆయన బలం. ప్రస్తుతం అనకాపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత చెల్లుబోయిన వేణు గోపాల్.. గత కేబినెట్ లో అనూహ్యంగా ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే ఆయన శెట్టి బలిజకు వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల నేత ఆయన ఒక్కరే.. అందుకే రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చారు.
తొలి కేబినెట్ లో మంత్రిగా ఉన్న తానేటి వనితకు మరో ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్.. రెండు కేబినెట్ ల్లో కొనసాగిన ఏకైన మహిళా మంత్రిగా తానేటి వనిత గుర్తింపు పొందారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్పీ వర్గానికి చెందిన ఆమె.. ఆ సామాజిక వర్గం ఓట్లను ప్రాభావం చేస్తారని సీఎం నమ్మకం ఉంచారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో కీలక నేత కొట్టు సత్యనారాయణ.. ముఖ్యంగా గెలుపును ప్రభావితం చేయగల కాపు సామాజిక వర్గానికి చెందిన నేత.. వచ్చే ఎన్నికల్లో జనసేనకి చెక్ పెట్టాలి అంటే కొట్టు సత్యనారాయణ లాంటి నేతలకు అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. అందుకే తాడేపల్లి నియోజకవర్గానికి చెందిన ఆయనకు అవకాశం కల్పించారు జగన్.
కొత్తగా ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా జోగి రమేష్ కు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. ఫైర్ బ్రాండ్ గా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో జోగి రమేష్ ముందు ఉంటారు.. పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయన బీసీ నేత.. గౌడ సామాజిక వర్గం ఓట్లను ప్రభావం చేయగల సత్తా ఉన్న నేతగా ఆయనకు చాన్స్ ఇచ్చారు జగన్.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు(Ambati rambabu) వైసీపీ కీలక నేత.. ముఖ్యంగా అధికార పార్టీ వాయిస్ వినిపించడంలో ఆయన ముందు వరసులో ఉంటారు. ముఖ్యంగా టీడీపీకి ఘాటు కౌంటర్లు ఇవ్వాలి అంటే అలాంటి నేత కేబినెట్ లో ఉండడమే మేలని భావిస్తున్నారు. దీంతో పాటు వైసీపీ మొదటి నుంచి జగన్ వెంట నడిచిన నేతల్లో ఆయన ఒకరు. కాపు సామాజిక వర్గ ఓట్లను ప్రభావం చేయగలరు.
గుంటూరు జిల్లా నుంచి తొలి కేబినెట్ లో సుచరిత హోం మంత్రిగా ఉన్నారు. ఆమెను ఇప్పుడు మంత్రి వర్గం నుంచి తప్పించి విడుదల రజనికి అవకాశం కల్పించారు. చిలుకలూరు పేట నియోజకవర్గానికి చెందిన ఆమె బీసీ సామాజిక నేత.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడం ఆమెకు ప్లస్ పాయింట్లు అని చెప్పొచ్చు.. ఆమె ప్రస్తుతం హోం మంత్రి రేసులో ఉన్నారనే ప్రచారం ఉంది.
నెల్లూరు జిల్లా నుంచి మంత్రి అనిల్ యాదవ్ ను తప్పించి కాకాణి గోవర్దన్ రెడ్డికి అవాకాశం కల్పించారు సీఎం జగన్.. సీనియర్ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఆయన.. సీఎం జగన్ కు వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అండగా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యింది.
గత కేబినెట్ లో ఉన్న కీలక మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్ ఒక్కరు.. సీఎం సామాజిక వర్గానికి చెందిన బుగ్గన డోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అందుకే ఆయనకు మరో ఛాన్స్ తప్పక ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితుల్లో.. ఆ శాఖను బుగ్గన తప్ప మరొకరు హ్యాండిల్ చేసే అవకాశం లేదని సీఎం జగన్ భావిస్తున్నారు. ఆందుకే ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చారు..
వైసీపీలో అంత్యంత కీలక నేత.. చిత్తూరు జిల్లాపై పూర్తి పట్టు ఉన్న సీనియర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన నేతే అయితే.. జిల్లా మొత్తం ఆయన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మొన్న స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు నిద్ర పట్టకుండా చేయడంలో పెద్ది రెడ్డి కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వక తప్పలేదు.
తొలి కేబినెట్ లోనే మంత్రిగా అవకాశం లభిస్తుందని భావించిన నేతల్లో రోజా ఒక్కరు. కానీ సామాజిక, జిల్లా సమీకరణల్లో ఆమెకు అవకాశం మిస్ అయ్యింది. అయినా నిరాశ చెందకుండా.. నగర నియోజకవర్గం నుంచి యాలా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పని చేసినా.. స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేశారు. అంతేకాదు ఫైర్ బ్రాండ్ గా ముద్ర ఉండడం కూడా ఆమెకు కలసి వచ్చింది.
సీఎం విధేయుడు అనడం కంటే.. పరమ భక్తుడు అనే ముద్ర ఉండడమే మేలని భావిస్తునరు నారాయణ స్వామి.. ఆ స్వామి భక్తే ఆయనకు జగన్ కేబినెట్ లో రెండో ఛాన్స్ దక్కేలా చేసింది అంటారు రాజకీయ విశ్లేషకులు.. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఆయన.. మాల అంటే ఎస్సీనేతగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించగలరు.. దీంతో ఆయనకు కూడా రెండో ఛాన్స్ దక్కింది.
అనంతపురం జిల్లా నుంచి చివరి నిమిషంలో అనూహ్యంగా చోటు దక్కించుకున్నారు ఉష చరణ్.. బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక మహిళా నేత ఆమె.. ప్రస్తుతం కళ్యాణ్ దుర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్ట్రాంగ్ లీడర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఉషశ్రీ చరణ్ సౌమ్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం కంచుకోటగా భావించే చోట వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసి అందరి దృష్టిలోకి వచ్చారు.
అదే జిల్లాకు చెందిన ఎస్టీ వర్గానికి చెందిన తిప్పేస్వామికి కూడా ఆఖరి నిమిషంలో అవకాశం కల్పించారు సీఎం జగన్.. ముఖ్యంగా ఎస్టీల ఓట్లు.. అనంతపురం రాజకీయ సమీకరణలను లెక్క వేసుకుంటూ.. సీఎం జగన్ తిప్పే స్వామికి అవకాశం కల్పించారు. మాదిగ నేతగా ఆ సామాజిక వర్గ ఓట్లపై ఆయన ప్రభావం ఉంటుందని సీఎం భావిస్తున్నారు.