CM Jagan Future: తెలుగు ప్రజలంతా భక్తితో ఘనంగా చేసుకునే పండుగ ఉగాది.. కొత్త ఏడాది ప్రారంభంగా చెబుతూ పండుగను చేసుకుంటారు. అయితే ఉగాది అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది పంచాంగ శ్రవణం కోసమే.. కొత్త ఏడాది ఎవరి జాతకం ఎలా ఉండబోతోంది..? మంచి జరుగుతుందా..? ప్రతికూల వాతావరణం ఉంటుందా..? రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తారు.. మరి సీఎం జగన్ జాతకం ఎలా ఉంది..?
శోభకృత్ నామ సంవత్సరంలో పొలిటికల్ పంచాంగం ఏం చెబుతోంది..? తెలుగు రాష్ట్రాల్లో ఏ లీడర్ భవిష్యత్ ఏంటి..? వాళ్ల రాశి ఏంటి? సీఎం హస్తవాసి ఏంటి? మళ్లీ సీఎం అవుతారా..? తాజాగా ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ కు పండితులు ఏం చెప్పారు..? ఆయన రాజ పూజ్యం ఎంత..? అవమానం ఎంత..? రాష్ట్ర ఆర్థిక కష్టాలు తీరుతాయా..?
సీఎం జగన్ కు కొత్త ఏడాది జాతకం ప్రకారం.. ఆయనది మిధున రాశి.. ఈఏడాది మేష రాశి వారికి ఆదాయం వ్యయం, రాజపూజ్యం అవమానం కాస్త ప్రతికూలంగా ఉన్నా.. కొన్ని మాసాలు కలిసి వస్తుంది అంటున్నారు. అయితే సీఎం జగన్ జాతక రీత్యం ఆయన ఆదాయం 2 రూపాయలు ఉంటే.. వ్యయం 11 రూపాయలు ఉంటుంది అంటున్నారు. ఇక రాజపూజ్యం 2 అయితే, అవమానం 4 అని రాశి ఫలాలు చెబుతున్నాయి.
ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిలు సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలకు ముందు శ్రీ వేంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో శుభాలు కలిగించాలని జగన్ ఆకాంక్షించారు.
తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. మండపంలోని గోడలకు దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి.