కేవలం మంగళగిరికి వచ్చి వెళ్లండం కాదు.. అక్కడ స్థానిక పార్టీ నేతలు-కార్యకర్తలు..ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చిన తాను ఉన్నాను అంటూ.. భరోసా ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి తీరుతాను అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేవలం తన సీటు అని మంగళగిరిపై ఫోకస్ చేయడమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలోనూ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ఇక ఆయన మాట తీరులోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రతిసారి ఆయన తడబడతారని విమర్శలు ఉండేవి.. కానీ ఇప్పుడు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.
కేసులకే భయపడని తాము.. ఇక నోటీసులకు భయపడతామా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. తన పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తూ.. పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని కొందరు నేతలు చెత్తబుట్టలో వేస్తే.. మరికొందరైతే తగలబెట్టారని చెప్పుకొచ్చారు. హత్యకు గురైన జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్.. 25 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
ఇప్పటికే లోకేష్ టూర్ కు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. అయితే తాను రోడ్డెక్కుతానని ప్రకటించిన లోకేష్.. ప్రభుత్వ విధానాలే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. అలాగే వచ్చే ఎన్నికల్లో 40 శాతం యువతకు సీట్లు కేటాయింపు నిర్ణయంలో కీలకంగా కూడా లోకేష్ వ్యవహరించారు.